Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా వ్యాప్తంగా ఆరుతడి పంటల సాగు పెంచేందుకు రైతులను క్షేత్రస్థాయిలో చైతన్యం చేస్తున్నాం. అయితే గత సీజన్లో పత్తి సాగు 7.29 లక్షల ఎకరాలు ఉండగా ఈసారి 8.10లక్షల వరకు సాగు చేయాలని నిర్ణయించారు. కందులు గతంలో 10 వేల ఎకరాలు కాగా ఈ సారి 50వేల ఎకరాలు, వేరుశెనగ గతంలో 2 వేలు ఉండగా ఈ సీజన్లో 10వేల ఎకరాలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అయితే వరి మాత్రం 4 లక్షల ఎకరాలు అనుకున్నాం కానీ 3.50 లక్షల ఎకరాల వరకే సాగు చేసేలా రైతులను అవగాహన పరుస్తాం. ఈ ఆరుతడి పంటలకు మార్కెట్ డిమాండ్ అధికంగానే ఉంది. వేరుశెనగ మద్దతు ధర రూ.5800 నిర్ణయించగా ఈసారి మార్కెట్లో రూ.8వేల వరకు రైతులు విక్రయించారు. ప్రస్తుతం వేరుశెనగ వాడకం బాగా పెరిగింది. 10 వేల ఎకరాల కంటే ఎక్కువ సాగు చేసినా మార్కెట్లో విలువ ఉంటుంది. పల్లీ నూనెగా మార్చేందుకు జిల్లాలో మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ, నకిరేకల్ లాంటి కేంద్రాలలో మిల్లులు ఉన్నాయి.
కంది, మిర్చి పంటను పత్తి పంటకు అంతర్ పంటగా వేస్తే కలిసొస్తుంది. ఈ రెండు పంటలు వేయడం వల్ల భూమిలో సారం కూడా పెరుగుతుంది. అంతేగాకుండా భూమి కూడా వృథాగా ఉండకుండా ఉంటుంది. ప్రతి రైతూ అంతర్ పంటను వేసేలా రైతులను చైతన్యం చేస్తున్నాం.
ఆముదం పంట గురించి చెప్పండి ?
ఆముదం పంట జిల్లాలోనే కాదు ఇతర జిల్లాలో కూడా కనిపించడంలేదు. ఒకనాడు మెజార్టీ భూముల్లో ఆ పంటను సాగు చేసేవారు. ఆముదానికి అంతర్జాతీ య మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం ఈ పంట గుజరాత్లో సాగవుతుంది. అయితే మన జిల్లాలో కూడా ఈ పంటసాగుకు అనుకూలమైన భూము లున్నాయి. అందుకే ఇక్కడ కూడ పెద్దఎత్తున సాగు చేయాలని నిర్ణయించాం. ప్రతిక్లస్టర్లో సుమారు 100 ఎకరాల వరకు సాగు చేసేలా కృషి జరుగుతుంది. ఇప్పటి నుంచి ఏఈవోలు దీనిపై కసరత్తు చేస్తున్నారు.
భూసారం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
ఒకే రకమైన పంటలు సాగు చేయడం. ఆ పంటకు దిగుబడి అధికంగా రావాలనే ఉద్దేశంతో రైతులు అవసరం ఉన్నదాని కంటే పెద్దమొత్తంలో ఎరువులు వాడుతున్నారు. దీంతో భూమిలో ఉన్న సారం పూర్తిగా లేకుండా పోయింది. దీంతో పంటల దిగుబడి తగ్గింది. అందువల్ల రైతులు భూసారాన్ని పెంచుకునేందుకు జీలుగ, జనుము విత్తనాలను 60 శాతం రాయితీపై అందిస్తున్నాం. మొక్కలు ఏపుగా ఎదిగిన తర్వాత పొలంలో కలియ దున్నితే భూమికి బలం వస్తుంది. పంట దిగుబడిలో మార్పు వస్తుంది. అందువల్ల రైతులు తప్పకుండా ఆ విత్తనాలు వాడుకోవాలని సూచించార.
గతంలో అధికారులు రాసిచ్చిన మేరకే ఏరువులను వాడాలని, అమ్మకం దారులు కూడా అంతమేరకే రైతులకు విక్రయించాలని ఆదేశాలిచ్చాం. కానీ నేడు ఆ ఉత్తర్వులు అమలు కావడంలేదు. ఎరు వుల వాడకం అధికంగా వాడుతున్నారు. నకిలీ విత్తనాల అమ్మకం దారుల పట్ల అన్నదాతలు జాగ్రత్తగా ఉండా ల్సిన అవసరం ఉంది. నకిలీ విత్తనాలు అమ్మినవారికి శిక్షలు వేసేందుకు సరైన చట్టం లేకపోవడం కూడా వాళ్లకు కొంత అలుసుగా మారింది. కానీ ఈ మధ్య పోలీసు అధికారులు నకిలీదారులపై కొరడా ఝుళిపిస్తు న్నారు. పీడియాక్టు కేసు నమోదు చేస్తున్నారు. ఎక్కువగా మహబూబ్నగర్ జిల్లా బూత్పుర్, గుంటూరు , మాచర్ల నుంచి ఎక్కువగా జిల్లా కు నకిలీ విత్తనాలు రవాణా అవుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రతి డీలర్షాపును పోలీసు అధికారుల తో కలిసి సోదాలు చేశాం. రానున్న రోజుల్లో కూడా చేస్తాం. రైతులు కూడా అప్రత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.