Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
నవతెలంగాణ-చింతపల్లి
సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల పితామహుడని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం చింతపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో 65 మంది లబ్దిదారులకు రూ.65,07,540 విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. కరోనాలాంటి సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసానిస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కంకణాల ప్రవీణావెంకట్ రెడ్డి, ఎంపీపీ కొండూరు భవాని, తహసీల్దార్ విశాలాక్షి, ఎంపీడీవో రాజు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు ఉజ్జిని విద్యాసాగర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్వ గిరిధర్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి దొంతం చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచులు గున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముచ్చర్ల యాదగిరి, పున్రెడ్డి సుమతి రెడ్డి, కొండూరి శ్రీదేవి శ్రీనివాస్, ఉజ్జిని లక్ష్మి సాగర్ రావు, కేశగోని రవీందర్ గౌడ్, మర్ల వెంకటయ్య, రమావత్ సుజాత కొండల్ నాయక్, దండేటికార్ లలిత బాయి మోహన్, బాల్ సింగ్, ఎంపీటీసీలు బూర్గు ధనమ్మ, ఎల్లంకి వరలక్ష్మి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
రైతు వేదికలు కర్షక దేవాలయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. బుధవారం మండలం నెల్వలపల్లి గ్రామంలో, చింతపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతు వేదిక రూ.22 లక్షల వ్యయంతో నిర్మించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి, ఎంపీపీ కొండూరు భవాని, తహశీల్దార్ విశాలాక్షి, ఎంపీడీఓ రాజు, రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు ఉజ్జిని విద్యసాగర్ రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నట్వ గిరిధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంతం చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచులు గున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముచ్చర్ల యాదగిరి, పున్రెడ్డి సుమతి రెడ్డి, కొండూరి శ్రీదేవి శ్రీనివాస్, ఉజ్జిని లక్ష్మిసాగర్ రావు, కేశగోని రవీందర్ గౌడ్, మర్ల వెంకటయ్య, రమావత్ సుజాత కొండల్ నాయక్, దండేటికార్ లలిత బాయిమోహన్, బాల్ సింగ్, ఎంపీటీసీలు బూర్గు ధనమ్మ, ఎల్లంకి వరలక్ష్మి అశోక్, సదానందం, చెట్టిపల్లి కిష్టమ్మ, కుంభం శ్వేత శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.