Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
అంగన్వాడీ సెంటర్లకు పంపించే సరుకులు అంగన్వాడీ సెంటర్లోనే దిగుమతి చేయాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం దేవరకొండ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఏసీడీపీవో ఖతీజాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసే నూనెను ఆర్టీసీ కార్గోకు అప్పజెప్పారన్నారు. ఆర్టీసీ కార్గో అంగన్వాడీ సెంటర్ దగ్గరికి లేకపోవడం వల్ల ఎక్కడో దూర ప్రాంతాల్లో రోడ్డు మీద ఆపితే అక్కడి నుంచి తీసుకోవాలని చెబుతున్నారన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లకు టీచర్లు, ఆయాలు బియ్యం మోసుకొని పోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తిప్పర్తి మమత, బి.మణెమ్మ, ఉషారాణి, సునంద, జి. జ్యోతి, జి.వినోద, ధనలక్ష్మి, డి.భవాని, జి.అనిత, ఎన్.సుశీల, కె.కమిలి, ఎం.పార్వతమ్మ, సుమిత్ర, పి.మంజుల, పద్మ, ధనలక్ష్మి, బాలమణి, బుజ్జి, శ్రీదేవి, లక్ష్మమ్మ, భారతమ్మ, లక్ష్మి, వరమ్మ పాల్గొన్నారు.