Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాను పచ్చని తివాచిగా మార్చేందుకు పక్క ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి తెలిపారు.బుధవారం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, సీజనల్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై సీఎస్ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు ,స్థానిక సంస్థల కలెక్టర్లు సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్పరెన్సులో రాజ్పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు వరంగల్ నుండిమాట్లాడారు.అనంతరం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న అన్ని నర్సరీల్లో ముందస్తు ప్రణాళికలో బాగంగా అనువైన అన్ని రకాల మొక్కలను అందుబాటులో ఉంచామని జిల్లా లక్ష్యం 86 లక్షలా 70 వేల మొక్కలు నాటే విధంగా పక్క ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.గ్రామీణ ప్రాంతంలో 71 లక్షలా70 వేల మొక్కలు అలాగే అర్బన్ప్రాంతాలలో 15 లక్షల మొక్కలు నాటామన్నారు.7వ విడత హరితహారం కార్యక్రమం ఒక ఉద్యమంలా నిర్వహించేందుకు అన్ని శాఖలను సమన్వయపరుస్తూ పక్క ప్రణాళికలు రూపొందించడంతో పాటు ఇప్పటికే జిల్లా అధికారులకు సూచనలు జారీ చేశామని వివరించారు.అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.జిల్లాలో అన్ని శాఖలకు మొక్కలు నాటేందుకు టార్గెట్ ఇచ్చామని, ఆదిశగా చర్యలు తీసుకుంటామన్నారు.ప్రతి గ్రామ పంచాయతీలలో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపడుతున్నామని తెలిపారు.ఈ కాన్ఫరెన్స్‌లో యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పద్మజారాణి, భువనగిరిడీఎఫ్ఓ ముకుందారెడ్డి, పీడీ కిరణ్‌కుమార్, డీపీఓ యాదయ్య,ఈఈఆర్అండ్బీ యాకుబ్, మున్సిపల్ కమిషనర్ రామాంజనేయరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డా.వెంకటరమణ, మున్సిపల్,ఫారెస్ట్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.