Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్
నవతెలంగాణ-తుంగతుర్తి
మండలకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి ఆధునీకరణకు, సౌకర్యాల కల్పనకు తనవంతు కషి చేస్తానని ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్ అన్నారు.బుధవారం మండలకేంద్రంలో రూ.33 లక్షల వ్యయంతో ఆస్పత్రి ఆధునికీకరణ మరియు కోవిడ్ 19 ఐసోలేషన్ సెంటర్‌ను ఆయన జెడ్పీ చైర్పర్సన్ దీపికాయుగంధర్రావుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.ఇప్పటికే 30 పడకల ఆసుపత్రినీ 100పడకల ఆస్పత్రికిగా మార్చేందుకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పాటు కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చానని, త్వరలో ఏర్పాటు చేసేందుకు కషి చేస్తానన్నారు.కరోనా కష్టసమయంలో ఈ ప్రాంత ప్రజలకు కోవిడ్ మహమ్మారి నుండి రక్షించడానికి ప్రభుత్వాస్పత్రిలో మంత్రితో పాటు తన కషితో 12 ఆక్సిజన్ తో కూడిన పడకలు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు త్వరలో ఈ ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలు కల్పించి, ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తనవంతు కషి చేస్తానన్నారు. ముఖ్యంగా అధునాతనమైన ఆపరేషన్ థియేటర్ లతోపాటు అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు జిల్లా వైద్య అధికారులతో సంప్రదించి ఏర్పాటు చేసేందుకు కషి చేస్తానన్నారు.అంతకుముందు మండలకేంద్రంలోని మార్కెట్ యార్డును పరిశీలించారు.ఈ మేరకు మార్కెట్ నిధుల నుండి రూ.50 లక్షలతో పాలకవర్గం కార్యాలయాల ఏర్పాటు చేయాలని మార్కెట్ అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీచైర్మెన్ పులుసు యాదగిరిగౌడ్, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నల్లు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య,గుండగాని రాములుగౌడ్, బీజేపీ నాయకులు సంకినేని రవీందర్రావు, గ్రంథాలయ చైర్మెన్ గోపగాని రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గౌడిచర్ల సత్యనారాయణ,జిల్లా మార్కెట్ అధికారి సంతోష్, డీఈఈ శ్యామల, ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీఎంహెచ్ఓ కోటాచలం, డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్థన్, డాక్టర్ నాగునాయక్, డాక్టర్ నిర్మల్‌కుమార్,డాక్టర్ మోహన్, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ వీణ,ఎంపీడీఓ లక్ష్మీ, డిప్యూటీ తహసీల్దార్ పుష్ప, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహిమూద్అలీ పాల్గొన్నారు.
తుంగతుర్తి:మండల పరిధిలోని అన్నారం గ్రామంలో బుధవారం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపికాయుగంధర్‌రావు పలు అభివద్ధిపనులను ప్రారంభించారు.ఈ మేరకు నాలుగు లక్షల రూపాయల నిధులతో నిర్మితమైన గోపాలమిత్ర భవనంతో పాటు ఏడు లక్షల నిధులతో నిర్మితమైన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల అభివద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. 2012లో శంకుస్థాపన జరిగి, నిర్మాణం జరగకపోవడం చేత, నిధులు కేటాయించి పూర్తి చేయించానన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవిత, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ చైర్మెన్ పులుసు యాదగిరిగౌడ్,వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, సర్పంచ్ మిట్టగడుపుల అనోక్, జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు, తుంగతుర్తి పశువైద్య ,సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు బయగాని రవి ప్రసాద్‌గౌడ్, వెలుగుపల్లి పశువైద్యాధికారి నరేష్, ఆర్డిఓ రాజేంద్ర కుమార్, ఎంపీడీవో లక్ష్మీ, డిప్యూటీ తహసీల్దార్ పుష్ప, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహిమూద్అలీ,వీఆర్ఓ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి కవిత, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు నల్లు రాంచంద్రారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షులు బోర నరేష్, గ్రంథాలయ చైర్మెన్ గోపగాని రమేశ్‌గౌడ్, సొసైటీ డైరెక్టర్ మజీద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపగాని శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఈ నవకాంత్, టీఆర్ఎస్ కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గౌడిచర్ల సత్యనారాయణ, మట్టపల్లి వెంకట్, కటకం వెంకటేశ్వర్లు,సైదులు పాల్గొన్నారు.