Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
పట్టణంలోని 31వ వార్డులో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిలాదిలీప్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక బ్రాహ్మణ కల్యాణమండపంలో నిర్వహించిన వార్డు అభివద్ధి కమిటీ సమావేశంలో నిర్వహించారు.వార్డులో నెలకొన్న సమస్యలను ఆమె తెలుసుకొని మాట్లాడారు.మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో వార్డులో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తు న్నామన్నారు.ఇప్పటికే వార్డులో నూతనంగా ఐదురోడ్లను వేయడంతో పాటు అన్ని వీధుల్లోనూ హరితహారం మొక్కలను నాటించి సంరక్షిస్తున్నట్టు తెలిపారు.కరోనా నేపథ్యంలో వార్డు ప్రజలందరికీ నిర్దారణ పరీక్షలు చేయించామన్నారు. వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా వార్డు వాసులు కోరారని ఈ విషయమై రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ దష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటుకు కషి చేస్తామన్నారు. వార్డు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశామని అందులో ఎలాంటి సమస్య ఉన్నా చెబితే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ప్రజలంతా వార్డు అభివద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రత్యేకాధికారి పద్మ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొండపల్లి దిలీప్‌రెడ్డి, వీరస్వామి, వెన్న శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరావు, నందకిషోర్, గురుమూర్తి, నాగయ్య, కృష్ణ, పూర్ణచందర్, జావేద్,హైమద్, భిక్షం పాల్గొన్నారు.