Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిిల్లీ సరిహద్దు ఘాజీపూర్‌లో రైతులు చేపట్టిన దీక్షలో జిల్లా నుండి తరలివెళ్లిన సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాల నాయకులు బుధవారం పాల్గొన్నారు. సింఘి బార్డర్‌ను సందర్శించి అక్కడి రైతు ఉద్యమ నాయకులను కలిసి, ఉద్యమంలోపాల్గొన్నారు. జాతీయ నాయకులు రాయల చంద్రశేఖర్, టి.సుధాకర్ మాట్లాడుతూ మోడీ తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని దేశంలోని ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారన్నారు. ఈ పోరాటానికి కులాలు మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు, సంఘాలు, రాజకీయ సంస్థలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఆర్నెలలుగా రైతాంగం పోరాడుతుంటే మోడీ, ప్రభుత్వం పటించుకోడం లేదన్నారు. రైతు ప్రతినిధులను చర్చలకు పిలిచి, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోకినపల్లి వెంకటేశ్వరరావు,పోలా ఈశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్.జనార్ధన్, నందగిరి వెంకటేశ్వర్లు, తుపాకుల నాగేశ్వరరావు, నీలం రాజు, అరుణోదయ సాంస్కతిక సమాఖ్య నాయకులు సబ్బారావు, అరెంపల వెంకన్న, మహర్షి, భూషణం, మురళి, సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.