Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
మండలంలోని ఇంద్రియాలగ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జగత్గౌడ్ అనారోగ్యంతో మతి చెందగా బుధవారం గ్రామంలో గంగాపురం జగత్గౌడ్ దశదినకర్మ సందర్భంగా ఆయన స్మారక స్తూపాన్ని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగత్ గౌడ్ ఉద్యమకాలం నుండి పార్టీని వెన్నంటి ఉంటూ చేసిన కషి మరువలేనిదన్నారు. కుటుంబానికి తాను అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్ ,మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, జిల్లా నాయకులు కోట మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కందాడ భూపాల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు రావులశేఖర్ రెడ్డి, సర్పంచ్ దొడ్డి అలివేలు, ఎంపీటీసీ మొగిలి పాక యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నోముల మాధవరెడ్డి, టీిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బండి కష్ణ, వైస్ చైర్మెన్ బత్కలింగస్వామి, చిట్టిపోలు శ్రీనివాస్, కౌన్సిలర్ లుగుండు మధు, తదితరులు పాల్గొన్నారు.