Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పమేలా సత్పతి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను భువనగిరిి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేష్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర శర్మ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వా మోహన్ రెడ్డి , సభ్యులు కేశవ రెడ్డి, రమేష్ , మార్కెట్ కమిటీ కార్యదర్శి అంజిత్ రావు , జూనియర్ అసిస్టెంట్ సాయి కిషోర్ , ఆయూబ్ పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన టీడీపీ నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పమేలా సత్పతిని బుధవారం టీడీపీ మండల కార్యదర్శి వల్దాస్ రాజు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. బస్వాపూర్ రిజర్వాయర్ లో ముంపునకు గురవుతున్న బిఎన్ తిమ్మాపురం గ్రామస్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల యువత అధ్యక్షులు ఎనబోయిన కనకరాజు, మండల ఉపాధ్యక్షులు ధనుంజయ గౌడ్ , భూ నిర్వాసితుల కన్వీనర్ రావుల శ్రీను పాల్గొన్నారు.
ఆర్యవైశ్యమహాసభ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇరుకుల్ల రామకష్ణ, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బుస్సా రమేష్ పాల్గొన్నారు.