Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుజూర్‌నగర్‌టౌన్
కోదాడ మాజీ ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి జన్మదిన వేడుకలను గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సాయిబాబా దేవాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్‌రావు, కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ అజిజ్ పాషా, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కష్టాల శ్రవణ్‌కుమార్, కౌన్సిలర్ కోతి సంపత్‌రెడ్డి, వెలిదండ సరిత వీరారెడ్డి, కారంగుల విజయ వెంకటేశ్వర్లు, దొంతిరెడ్డి సంజీవరెడ్డి, జక్కుల మల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు బాచ్ మంచి గిరిబాబు, సులువా చంద్రశేఖర్, దొంతాగాని జగన్, వంగవీటి బ్రహ్మం, బిక్కన్సాబ్ తదితరులు పాల్గొన్నారు.