Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
పట్టణంలో మరో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి బొలిశెట్టి కృష్ణయ్య ఆధ్వర్యంలో గురువారం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో నిరంజన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వాక్సినేషన్ కేంద్రాన్ని వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారని, కరోనా నిబంధనలు పాటించక పోవడంతో సాధారణ ప్రజలు కరోనా బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో మరిన్ని కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు నూనె సులోచన, కనగాల నారాయణ, సాతులూరి హనుమంతరావు, చిలుకూరి శ్రీనివాసరావు, షేక్ మతీన్, ఉప్పతూల చిన్న బంధం, తిరుపతయ్య, రైతు కళ్యాణ్‌రామ్, కోటి, సుధాకర్‌రెడ్డి, యరగాని రాధాకృష్ణ ఉన్నారు.