Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
పద్మశాలీల సంక్షేమం కోసం టీిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం స్థానిక మార్కండేయ స్వామి దేవాలయ ఆవరణలో అభయ మార్కండేయ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 35 లక్షలు కేటాయించానని పేర్కొన్నారు. త్వరలో మరో రూ. 20 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు యలగందుల కష్ణ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,పీఏసీఎస్ చైర్మెన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, నాయకులు మురారి శెట్టి కష్ణమూర్తి, పద్మశాలి సంఘం ప్రతినిధులు మూడు దొడ్ల కష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.