Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18న నిరసన దినంగా పాటిస్తాం
- ఐఎంఏ జిల్లా అధ్యక్షులు పుల్లారావు
నవతెలంగాణ- నల్లగొండ
దేశంలో డాక్టర్లపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకు శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియే షన్ ఆధ్వర్యంలో నిరసన దినాన్ని పాటిస్తున్నా మని ఐఎంఏ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు తెలిపారు. ఈ మేరకు గురువారం కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. కరోనా రోగులకు వైద్యం అందించిన సమయంలో దేశంలో 700 మంది డాక్టర్లు కరోనాతో మృతిచెందారని తెలిపారు. ఈ దాడులను అరికట్టేందుకు ఈ నెల18న రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి వినతి పత్రాలు అందజేసి నిరసన దినంగా పాటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు దైవాదీనం, యాదయ్య, హేమలత, అనితారాణి, రాజేశ్వరి, రాఘవేంద్రరెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.