Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-కేతెపల్లి
కళ్యాణ లక్ష్మీ పథకం పేద ఇంటి ఆడపడుచులకు వరం లాంటిదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 49 మంది లబ్దిదారులకు 50 లక్షల విలువ గల కల్యాణ లక్ష్మి చెక్కులను, 2 లక్షల విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను గురువారం మండల కేంద్రంలో పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అముల చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బొస్క మాధవి, జెడ్పీటీసీ బొప్పని స్వర్ణలత, తహసీల్దార్ డి.వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ఎంపీడీఓ భవాని, టీఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి చెమట వెంకన్న యాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బంటు మహేందర్, కొప్పుల ప్రదీప్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు బడుగుల శ్రీనివాస్ యాదవ్,్ కట్ట శ్రవణ్ కుమార్, కోట వెంకటేశ్వరరావు, నకిరేకల్ మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ , మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి రెడ్డి సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ చల్ల కష్ణారెడ్డి, టీఆర్ఎస్ యువజన అధ్యక్షులు మీసాల ధనరాజ్ టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు వంటల చేతన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.