Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
కష్టకాలంలో కరోనా బాధితులు, బంధువులకు గురువారం రెండోరోజు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లాకేంద్ర ప్రభుత్వాస్పత్రిలో 150మందికి ఉచితంగా భోజనం పంపిణీచేశారు. ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ జయసింగ్ రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ కరోనా బాధితులకు రోగులకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. జిల్లా కేంద్రంలో కరోనా బాధితులకోసం ఐసోలేషన్ కేంద్రాన్ని ఎంవీఎన్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసి వైద్యం ,ఆహారం, వసతి తో పాటుగా ప్రభుత్వ ధవఖానలో ఉచిత భోజనం అందించడం హర్షణీయమన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు 15 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి ఎండి.సలీం, జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య భూతం అరుణకుమారి, బొల్లు రవీందర్, నితీశ్ కుమార్, రేణుక, ఝాన్సీ, స్వీటీ, తదితరులు పాల్గొన్నారు.