Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
మండల కేంద్రంలో సర్వేనెంబర్ 29 ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్న రెవెన్యూ అధికారులు కాపాడటం లేదని నిరసన వ్యక్తం చేస్తూ గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కళ్యాణ చెక్కులు పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని ప్రజలు అడ్డుకున్నారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ భూమిని కాపాడి లబ్దిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎమ్మెల్యే బాధితుల నుండి ఈ విషయాన్ని అడిగి తెలుసుకున్నారు . అనంతరం జిల్లా సర్వేయర్‌తో మాట్లాడి వెంటనే సర్వేనెంబర్ 29 సర్వేనెంబర్లో సర్వే నిర్వహించి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, పట్టణ కార్యదర్శి కూర శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుర్కపల్లి సురేందర్, నాయకులు గదాసు నరసింహ, బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పల్లెల రామచంద్రన్, ఏకలవ్య సంఘం మండల అధ్యక్షులు బొరుగుల నరసింహ, 50 మంది బాధితులు పాల్గొన్నారు.
అంబులెన్సుకు సొంత ఖర్చు భరిస్తాం: ఎమ్మెల్యే
మండలంలో అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు, గర్భిణులు సమయానికి ఆస్పత్రికి తరలించడానికి తన సొంత ఖర్చులతో అంబులెన్సు నిర్వహణకు రూ.350000 భరిస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు గురువారం మండలంలో ఏడు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాన్ని అన్ని రంగాల్లోనూ అభివద్ధి చేయడానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ ,సింగిల్‌విండో చైర్మెన్ సురకంటి వెంకటరెడ్డి, మార్కెట్ చైర్మెన్ కోనపూరి కవిత, స్థానిక సర్పంచ్ లలిత ,ఎంపీటీసీలు భాగ్యమ్మ ,యశోద ,తహసీల్దార్ నాగలక్ష్మి, ఆర్ఐ.కర్ణాకర్ రెడ్డి ,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.