Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో 35 మంది లబ్దిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మీచెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోత్కూరు, అడ్డగూడూరు మండలాల రైతులు సాగునీటి కాల్వలు లేక బోరు, బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారన్నారు. ఈ మండలాలకు సాగునీరు అందించేందుకు గతంలో తవ్విన బునాదిగాని కాల్వ సకాలంలో పూర్తికాక ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. 98 కిలోమీటర్లు ఉన్న ఆ కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటి కెపాసిటీతో చివరి వరకు నీళ్లు వచ్చే పరిస్థితి లేనందున విషయాన్ని సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్లగా రూ.100 కోట్లు కేటాయించారని, చాలా వరకు కాల్వ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీటి సంధ్యారాణిసందీప్, జడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు, టీ ఆర్ ఎస్ మండల, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, గజ్జి మల్లేష్, రచ్చ లక్ష్మీ నర్సింహా రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాంపాక నాగయ్య, తహసీల్దార్ షేక్ అహ్మద్, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, ఆర్ఐ గాలయ్య, ఎంపీవో సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.