Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం కలెక్టర్ బస్వాపూర్ ప్రాజెక్టు చేరుకొని పనుల పురోగతిని సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుర్షిద్, ఆర్డీఓ భూపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు రిజర్వాయర్లో ్ల ఒకటిన్నర టీఎంసీల నీటి సామర్థ్యంతో నింపాలన్న లక్ష్యం మేరకు పనులు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 79 కోట్లతో పాటు మరో 36 కోట్ల నిధులు 1,రెండు రోజులలో భూసేకరణ ప్రక్రియ సిద్ధం చేసుకొని ఉండాలని ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాలను కలెక్టర్ మ్యాపు ద్వారా పరిశీలించి అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కాంట్రాక్టర్ సురేందర్ రెడ్డి, రమణారెడ్డి ఉన్నారు.