Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
కరోనా కష్ట కాలంలో కుష్టురోగుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. గాస్పల్ ఫర్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఖమ్మం ఆధ్వర్యంలో పట్టణంలోని లెప్రసీకాలనీలో గురువారం 152కుటుంబాలకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు. నెల రోజులుగా జీటీఎస్ఎస్ఎస్ సేవా కార్యక్రమంలో భాగంగా కుష్టురోగుల కుటుంబాలకు కూడా సహాయం చేయడం అభినందనీయమన్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి , డీఎస్పీ వేంకటేశ్వరరెడ్డి,నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్‌చైర్మన్ అబ్బగోని రమేష్,జిల్లా పరిషత్ కో ఆప్షన్ మెంబర్ తీగల జాన్ శాస్త్రి , సంస్థ ప్రతినిధులు మురళీకష్ణ రెడ్డి, అశోక్ కుమార్, పీటర్ తడగొండ, పాస్టర్ సామేలు.కే రమేష్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.