Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ , పెట్రోల్ ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గసభ్యులు మంగ నర్సింహులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్రోల్ ,డీజిల్, నిత్యావవసర ధరల పెంపుతో సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ పట్టణ కార్యదర్శి ఎంఏ.ఇక్బాల్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సంస్కరణల చట్టాలను ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో జరుగుతున్న రైతన్న ఉద్యమాన్ని నీరు కార్చడం కోసం కుటిల ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ప్రజల తిరస్కరణకు గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి మోరిగాడి రమేష్,నాయకులు వడ్డెమాను శ్రీనివాసులు, జూకంటి పౌలు, ఘన గాని మల్లేష్, బుగ్గ నవీన్, చెన్న రాజేష్, భువనగిరి గణేష్ ,కాసుల నరేష్ ,మాదాని నవీన్, ఎలుగల శివ, మోరీగడి లక్ష్మణ్, చెక్క పరశురాములు, మోరిగాడి అంజయ్య, ఘనగాని రాజు ,భోగం రమేష్, కూరెళ్ల రవి, కళ్యాణ్ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు