Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-పెన్పహాడ్
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గౌని మట్టపల్లి జీవితం నేటి తరానికి ఆదర్శమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మీ అన్నారు. మండలంలోని భక్తాలపురం గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గౌని మట్టపల్లి సంతాప సభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, దున్నేవానికే భూమి దక్కాలని నాటి నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రాణాలు ఎదురొడ్డి పోరాడిన నాయకుడు గౌని మట్టపల్లి అని అన్నారు. సాయుధ పోరాట కాలం నుంచి నేటి వరకూ ఎర్రజెండా నీడలో పేద ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గురి గోవింద్, ధనియకుల శ్రీకాంత్, మండల కార్యదర్శి రణపంగ కృష్ణ, నెమ్మాది అడివయ్య, కిరణ్, చింతం వెంకటేశ్వర్లు, గోపాలదాసు శ్రీరాములు, గౌని పుల్లయ్య, రామకృష్ణ, రఘు, నెమ్మాది ఉపేందర్, అబ్బాస్, నాగరాజు, మట్టిపల్లి కుటుంబ సభ్యులు సైదమ్మ, దేవకమ్మ, రజని, నిర్మల, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.