Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట:కరోనా నివారణకు టికాయే శ్రీరామ రక్ష అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితదేవి ఆనంద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ సిబ్బందికి నిర్వహించిన టీకా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఉచిత టీకా ఇస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ శాఖ అధికారి కోటాచలం, డిప్యూటీ జిల్లా అధికారి హర్షవర్ధన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పల ఆనంద్, మార్కెట్ కార్యదర్శి ఫసియోద్దీన్, తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యదర్శి మాండన్సుదర్శన్, పెద్దగట్టు చైర్మెన్ కోడి సైదులుయాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ ముద్దం కృష్ణారెడ్డి, డైరెక్టర్స్ ముప్పారపు నాగేశ్వరరావు, సల్మామస్తాన్, ఊటూకూరి సైదులు, బానోతు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.