Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
తమకు వేతనాలు పెంచాలని కోరుతూ మండలంలోని గూడూరు, రుద్రారం గ్రామపంచాయతీ కార్మికులు గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఆయా పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా కాలంలో గ్రామపంచాయతీ కార్మికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కానీ వారికి ఇచ్చే వేతనం అతి తక్కువగా ఉందన్నారు. పనికి తగ్గ వేతనం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. పెంచిన 30 శాతం ఫిట్‌మెంట్‌ను గ్రామపంచాయతీ కార్మికులకు కూడా వర్తింపజేయాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు ప్రత్యేకంగా ఆర్థికసాయం అందజేయాలని, వారు ఆరోగ్యకరంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ విక్టోరియా, ఉప సర్పంచ్ బొగ్గరపు శ్రీనివాస్, వార్డ్ మెంబర్ గోపి, గ్రామ పంచాయతీ వర్కర్స్ కోటయ్య, నగేష్, ముత్తమ్మ, శ్రీనివాస్, రామానుజన్.తదితరులు పాల్గొన్నారు.