Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నట్టు 32వ వార్డు కౌన్సిలర్, జిల్లా మైనార్టీ నాయకులు ఎస్కె.జహీర్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని 32 వార్డులో నిర్వహించిన వార్డు అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డులో నెలకొన్న సమస్యలను వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరిస్తే మున్సిపల్ అధికారుల సహకారంతో పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే వార్డులోని అన్ని ప్రాంతాల్లోనూ సీసీ రోడ్లు వేయించినట్టు చెప్పారు. వార్డులో దొంగల భయం లేకుండా ప్రతి వీధిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి రాజేష్, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు యాదగిరి, రేస్ నాగయ్య, మాచర్ల కృష్ణ, దొడ్డ కృష్ణమూర్తి, మన్నెం యాదగిరి, సత్యనారాయణ, బ్రహ్మచారి, సైదులునాయక్, విజరు, కిరణ్, మహేష్, 32 వార్డు యూత్ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు పాల్గొన్నారు.