Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులతో సహపంక్తి భోజనం, సమావేశం
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి, ప్రభుత్వ విప్ గొంగడి సునీత
నవతెలంగాణ - భువనగిరిరూరల్
ఈ నెల 22న సీఎం కేసీఆర్ యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో సీఎం పర్యటన ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ పమేలా సత్పతి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, పలువురు అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు, వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 22న సీఎం తమ గ్రామానికి వస్తున్నట్టు తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్టు గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు తెలిపారు. సీఎం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహాపంక్తి భోజనం చేసే ప్రాంతం, బహిరంగ సభ ఏర్పాట్లకు కలెక్టర్, ప్రభుత్వ విప్‌లు పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకుండా అన్ని ఏర్పాట్లూ కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలని, హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో సీహెచ్.కృష్ణారెడ్డి, మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి, స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ ఆంజనేయులు పాల్గొన్నారు.