Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోటి ఎకరాల మాగానే ప్రభుత్వ లక్ష్యం
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ - తిప్పర్తి
రైతు వేదికల వద్దే సమస్యలు పరిష్కారం అవుతాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలో నిర్మించిన రైతు వేదికను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ఆరేండ్లల్లో కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ నీరందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పక్కనే నాగార్జునసాగర్ ఉన్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చుక్క నీరు రాకుండా గత పాలకులు ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే అందులో నల్లగొండ నియోజక వర్గం నుండి అత్యధిక వరి ధాన్యం 19 లక్షల మెట్రిక్ టన్నులు పండిందని అన్నారు. తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో రూ.4.5 కోట్లతో పాలేరు వాగు బ్రిడ్జిని మంజూరు చేయించినట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తిప్పర్తి జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, లింగారావు, పీఏసీఎస్ చైర్మెన్ పాశం సంపత్‌రెడ్డి, వైస్ చైర్మెన్ కందుల రేణుక, లక్ష్మయ్య, ఎంపీడీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, కొమ్ము గిరి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.