Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ - చిట్యాల
కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతువేదిక, పల్లె ప్రకృతివనం, స్మశాన వాటికలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కాలానికనుగుణంగా వ్యవసాయ పంటల్లో మార్పు జరిగితే రైతులకు లాభం జరుగుతుందని చెప్పారు. పల్లె ప్రకృతి వనాలతో సకాలంలో వర్షాలు పడి, పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీవో లాజర్, మండల వ్యవసాయాధికారి గిరిబాబు, ఎంపీవో పద్మ, జెడ్పీటీసీ సుంకరి ధనమ్మయాదగిరి, ఎంపీపీ కొలను సునీతవెంకటేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సత్తయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉయ్యాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 95 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.95,11,20 వేల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీవో లాజర్, మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌రెడ్డి, మండలాధ్యక్షులు జడల అదిమల్లయ్య, ఎంపీపీ కొలను సునీతవెంకటేష్, జెడ్పీటీసీ సుంకరి దనమ్మయాదగిరి, వైస్ ఎంపీపీ, వివిధ గ్రామల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.