Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.19,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి సునీత, సర్పంచ్ శైలజకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి పోతెపాక వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం జీవో 64ను విడుదల చేస్తూ వివిధ శాఖల్లో పనిచేస్తున్న క్యాజువల్ లేబర్, డైలీ వేజ్ వర్కర్స్, ఫుల్ టైం, కంటిన్జెన్సీ వర్కర్స్, కన్సాలిడేటెడ్ వర్కర్స్కు రూ.10,400 వేతనం నిర్ణయించిందని చెప్పారు. కానీ గ్రామ పంచాయతీ సిబ్బందికి పెంచలేదని పేర్కొన్నారు. 16 నెలలుగా కరోనా విపత్తులో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతూ పనిచేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. విస్మరించడం అత్యంత బాధాకరం అన్నారు. వేతనాల విషయంపై ఈ నెల 21న డీపీవోకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో పంచాయతీ సిబ్బంది నలపరాజు మల్లయ్య, పగిళ్ల కోటేష్, నలపరాజు రాములు, గోవింద చారి తదితరులు ఉన్నారు.