Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
వైద్యులు,వైద్య వత్తిపై హింసను ఆపాలంటూ, ప్రాణాలు కాపాడే డాక్టర్లను రక్షించాలని సూర్యాపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని శంకర్ విలాస్సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.కొత్తబస్టాండ్ వద్ద కరోనాతో మతిచెందిన డాక్టర్లకు నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ టీ. విద్యాసాగర్, డాక్టర్ రమేశ్చంద్రలు మాట్లాడుతూ డాక్టర్ వత్తి ఎంత పవిత్రమైందో అంతే రిస్కుతో కూడుకున్నదన్నారు.దాదాపు ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగి ప్రాణాలను కాపాడేందుకు తాము తపన పడతామన్నారు.మనిషి ప్రతి ఆరోగ్య సమస్య డాక్టర్‌కు మాత్రమే తెలుస్తుందని,ఎలాంటి రోగులు వచ్చినా వారికి ధైర్యం చెప్పి తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తామన్నారు.ఇటీవల పెద్దలు నాయకులు వైద్యవత్తిని అవమానించేలా మాట్లాడడం బాధాకరమన్నారు.డాక్టర్లను దూషించడం, వారిపై భౌతికంగా దాడులు చేయడం సరికాదన్నారు.డాక్టర్లపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను అరికడుతూ ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.కరోనా సమయంలో సైతం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ముందుండి వైద్య సేవలు అందించామని గుర్తుచేశారు.కరోనా మొదటి రెండో విడతలో సుమారు 1500 వందల మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మతి చెందిన డాక్టర్ లవి వీర మరణాలుగా గుర్తించి వారి కుటుంబాలను ఆర్థికంగా, ఉద్యోగపరంగా ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు.ఏ దేశంలో అయితే వైద్యుడి రక్తం చిందుతుందో ఆ దేశం తిరోగమనదిశగా ప్రయాణిస్తుందని గుర్తించాలన్నారు. డాక్టర్లకు మానవత్వం ఉందని వారు మీకోసమే పొద్దంతా కష్టపడుతున్నారని గుర్తించి మమ్మల్ని రక్షిస్తే మేము దేశాన్ని రక్షిస్తామన్నారు.ఇక నుంచైనా డాక్టర్లపై దాడులు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు రమేశ్‌నాయక్, యశ్వంత్పటేల్, మీలాసందీప్, మధుబాబు, రామ్మూర్తి, శ్రీనివాసరావు, రామకష్ణ, రాజమనోహర్‌రెడ్డి, బడుగుల యశ్వంత్, శ్రీధర్, శ్రీరామ్, కిరణ్, అతుల్‌రారు, కలాం,బీఎం చంద్రశేఖర్, హరికష్ణ,గిరిధర్‌రెడ్డి, మహిళా వైద్యులు విజయలక్ష్మీ, అరుణజ్యోతి, డాక్టర్ శిరీషడాంగే, షాలిని, మీనాక్షి, మౌనిక, సుప్రజ, మధులిక పాల్గొన్నారు.