Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
18 ఏండ్లు పూర్తయితనే ఆడపిల్లలకు వివాహం చేయాలని,బాల్య వివాహాలు చట్టరిత్యా నేరమని ఐసీడీఎస్ సూపర్వైజరు సైదాభేగం అన్నారు.మండలంలోని రేగులగడ్డ పంచాయతీ పరిధిలోని రాంనగర్ తండా లో ఇద్దరు మైనర్ బాలికలకు వివాహం జరిపిస్తున్నాన్న సమాచారం మేరకు ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో అక్కడకు చేరుకున్నారు.ఈనెల21న ఒక మైనర్ బాలికకు వివాహం మరో మైనర్ బాలికకు నిశ్చితార్థం జరిపారు.దీంతో అధికారులు బాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి 18ఏండ్లు పూర్తి చేశాక వివాహం జరిపించాలని వారి చేత అంగీకారపత్రం తీసుకున్నారు.బాలికలను చదివించాలని సూచించారు. అలాగే గ్రామంలో బ్రూణహత్యలు, అక్రమదత్తత, బాల్యవివాహలు,శిశువిక్రయాలు చేపడితే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రమణి, వీఆర్ఏ మట్టయ్య, కానిస్టేబుల్ ఎం.వెంకటేశ్వర్లు నరేష్,అంగన్వాడీ టీచర్ సరోజిని, కృష్ణవేణి పాల్గొన్నారు.