Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
నిత్యం పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతుండడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం దంతాలపల్లి-సూర్యాపేట ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనాన్ని తాడుతో లాగుతూ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి మాట్లాడారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్‌తో నిత్యావసరాల ధరలు రెండి ంతలు పెరిగాయన్నారు.వెంటనే తగ్గించాలని కోరారు.ఈ కార్య క్రమంలో సీనియర్ నాయకులు కందాల కష్ణారెడ్డి, యల్లావుల నరేష్, ఉప్పులరమేశ్, తోట్ల లింగయ్య, బాణాల విజయభాస్కర్‌రెడ్డి,తొట్ల హరీష్, కొల్లు జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
నేరేడుచర్ల : పాలకీడు మండలకేంద్రంలో పెంచిన డీజిల్, పెట్రోల్ ,గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంతప్రకాష్ మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక 22 సార్లు డీజిల్ ,పెట్రోల్ ధరలు పెంచిందని,ఇప్పటికే లీటర్ పెట్రోల్‌కు రూ.100 దాటిందన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం ప్రజలపై భారాలు వేయడమేనన్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్‌చైర్మెన్ పగడాల మట్టేష్, మాతంగి ఏసురత్నం, ఇరుకు సైదులు, కొండా పెద్ద ఎల్లయ్య, పొదిల శ్రీను,వెంకట్‌రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.