Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
దేశవ్యాప్తంగా డాక్టర్లపై దాడులను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్త కరోనా సమయంలో ప్రాణాలను పనంగా పెట్టి లక్షల మంది వైద్యుల ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. దాదాపు 7400 మంది డాక్టర్లు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం సహకరించాలన్నారు. వ్యాధి తీవ్రత ఎంత తక్కువగా ఉన్నా..ప్రతి రోగిని బతికించమని ప్రజలు కోరుతున్నారన్నారు. వైద్యులు, వారి సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా..చివరి దశలోనున్న రోగి మరణిస్తున్నాడని, భయబ్రాంతులైన ప్రజలు వైద్య సిబ్బందిపైన ఆస్పత్రులపైన, డాక్టర్లపైన దాడి చేస్తున్నారన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు, అంజయ్య, మనోహర్‌రెడ్డి, సరిత, సుష్మ, శ్రీదేవి, అశ్విన్‌కుమార్, గిరిప్రసాద్, శేఖర్‌రెడ్డి, కష్ణప్రసాద్, అశోక్‌రెడ్డి, వాసంతి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
కోదాడరూరల్: పట్టణంలోని తిరుమల హాస్పిటల్లో వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వైద్యులు శుక్రవారం నిరసన తెలియజేశారు. కోదాడ, హుజూర్ నగర్ బ్రాంచి ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు డాక్టర్ల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ ప్రమీలా శ్రీపతిరెడ్డి మాట్లాడుతూ కరోనా మొదటి వేవ్ లో దాదాపు 800 మంది వైద్యులు చనిపోగా రెండో విడతలో 900 మంది వైద్యులు మృతి చెందారన్నారు.తమ ప్రాణాలను పణంగా పెట్టి జాతి మానవాళికి సేవ చేస్తుంటే డాక్టర్లను దూషించడం,వారిపై భౌతికదాడులకు దిగడం హేయమైన చర్య అన్నారు.ఐఎమ్ఏ అధ్యక్షులు డాక్టర్ దశరథనాయక్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు వల్ల డాక్టర్ల మనోధైర్యాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం వైద్యవృత్తిలో మృతి చెందిన వైద్యులకు నల్లబ్యాడ్జీలు ధరించిన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ సెక్రెటరీ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ సభ్యులు డాక్టర్ శ్రీపతిరెడ్డి, డాక్టర్శివప్రసాద్రెడ్డి, డాక్టర్ శ్యాంసుందర్, డాక్టర్ ఎల్.భాస్కర్, డాక్టర్ సందీప్‌రెడ్డి , డాక్టర్ సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు.