Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడలోని ఆర్యన్స్కూల్లో గణితమాస్టర్గా బోధన చేస్తూ 20 ఏండ్లుగా మిర్యాలగూడలో జీవనం కొనసాగిస్తున్న రాజవరం శ్రీహరి (48 ) కొద్దిరోజులుగా కరోనా మహమ్మారితో బాధపడుతూ స్థానిక ఏరియాహాస్పిటల్లో మృతి చెందాడు.కుటుంబ పెద్ద కోల్పోయి అంతులేని దుఃఖంలో వున్న కుటుంబ సభ్యులకు స్థానికంగా ఎవరూ పరిచయం లేకపోవడంతో స్థానిక రహమాన్ఖాన్కు ఫోన్ చేయడంతో ఆయన వెంటనే స్పందించారు. అంత్య క్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేసి స్వయంగా తానే హిందూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమం నిర్వహించారు.సందర్బంగా కుటుంబసభ్యులు, స్థానికులు మాట్లాడుతూ కరోనాతో చనిపోయిన వ్యక్తిని చూడడానికి రాకుండా భయపడుతున్నారన్నారు.అలాంటిది ఇప్పటివరకు దాదాపు 50 మంది కరోనా సోకి మరణించిన వ్యక్తుల యొక్క అంత్యక్రియలు చేసిన మహమ్మదీయ సోదరుడు రహమాన్ ఖాన్ సేవలు మిర్యాలగూడ ప్రజలు ఎప్పటికీ మరచి పోరన్నారు. మతాలు వేరైనా మనమంతా భారతీ యులమేనని రహమాన్ఖాన్ నిరూపిస్తు న్నారన్నారు.అంత్యక్రియల్లో ఆసిఫ్బాబా పాల్గొన్నారు.