Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ వ్యాపారవేత్త మహేందర్
నవతెలంగాణ - నల్లగొండ
ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేది కమ్యూనిస్టులేనని ప్రముఖ వ్యాపారవేత్త మహేందర్ అన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రి ఎదుట చేపట్టిన అన్నదానం శుక్రవారం 3వ రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయన్నారు. ప్రతి రోజూ వందలాది మంది కరోనాతో చని పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అన్నదానం చేయడం అభినందనీయమన్నారు.
చిన్నపిల్లల వైద్యులు కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సీపీఐ(ఎం) సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలను ఆదుకుంటుందన్నారు. ఇతర ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి ఎమ్‌డి.సలీం, జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, పాలడుగు ప్రభావతి, దండెంపల్లి సత్తయ్య, ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, నాయకులు పోలే సత్యనారాయణ, వెంకట్‌రెడ్డి, పాలడుగు నితీశ్‌కుమార్, రేణుక, జానకీ, స్వీటీ, కాటేపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.