Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎంఏ జిల్లా అధ్యక్షులు పుల్లారావు
- నల్ల బ్యాడ్జీలతో వైద్యుల నిరసన
నవతెలంగాణ - నల్లగొండ
వైద్యులపై భౌతిక దాడులు సరికావని ఐఎంఏ జిల్లా అధ్యక్షులు పుల్లారావు అన్నారు. వైద్యులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రోగులకు ఆటంకం కల్గకుండా నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది వైద్యులు శ్రమకోర్చి రోగులకు చికిత్స అంది స్తున్నారని తెలిపారు. దురదృష్టవశాత్తు ఎక్కడైనా రోగి చనిపోతే చికిత్స అందించిన వైద్యులపై రోగి బంధువులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై జరిగే దాడులను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ జయప్రకాశ్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, కార్యదర్శి పీవీ.ఎన్ మూర్తి, వైద్యులు దైవాదీనం, నరహరి, కృష్ణ చైతన్య, అనితారాణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.