Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
కష్ణా జలాల విషయంలో ప్రభుత్వం పోరాడకపోతే తెలంగాణ ఎడారిగా మారుతుందని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.కష్ణాజలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.ఈ విషయంలో ప్రభుత్వం పోరాడాల్సిన అవసరముందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి ప్రకటన విషయంలో సీఎం కేసీఆర్ ఖండించడం హర్షణీయమన్నారు.కష్ణాజలాల విషయంలో వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించి అందర్ని కలుపుకొని పోరాడాలని కోరారు.ప్రభుత్వ భూములు అమ్మకం చేయాలని పాలకులు నిర్ణయించి ప్రతి జిల్లాకు వెయ్యి ఎకరాలు అమ్మకం చేయాలని నిర్ణయించడం అన్యాయమన్నారు.డబుల్బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి, ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలకు స్థలం లేక ఇబ్బందులు పడుతుంటే వాటిని అమ్మి డెవలప్మెంట్ చేయాలని అంటున్నారని, ఇది అన్యాయమన్నారు.అభివద్ధికి అప్పులు తెస్తారని, భూములు అమ్ముతూ వారి ఇష్టారాజ్యంగా పాలన చేయడం అన్యాయమన్నారు.తమ ఇష్టారాజ్యంగా రీడిజైన్, రీబడ్జెట్లు చేసి కమీషన్లు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నా రన్నారు.ఫలితంగా ప్రజలకు నష్టం వాటిల్లుతుందన్నారు.ఏకపక్ష నిర్ణయాలు సరికాదని, నష్టం జరుగుతుందన్నారు.అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులివ్వాలని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తామనేది సబబు కాదని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు.అందరికీ ఉచిత వైద్యం అందించాలన్నారు. సీజన్ మొదలైంది ఐకేపీ బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఎరువులు సబ్సిడీపై అందించాలని, నాణ్యమైన విత్తనాలివ్వాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, రైతు సంఘం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నూకల జగదీశ్చంద్ర పాల్గొన్నారు.