Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
ప్రభుత్వభూములు, ఆస్తులను అమ్మి ప్రభుత్వాన్ని నడిపించాలనే ప్రభుత్వ నిర్ణయం చేతగానితనానికి నిదర్శనమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి విమర్శించారు. ఆదివారం మండలంలోని పెంచికల్దిన్నగ్రామంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన వల్లంశెట్ల శేఖర్‌రావు చిత్రపటానికి ఆయన పూలమాలలేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢసానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదల ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తుచేసుకున్నారన్నారు.పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం చేతగాని ప్రభుత్వం ఆస్పత్రులు కట్టడానికి, స్కూళ్లు, హాస్టల్ బిల్డింగ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు నిర్మించడానికి స్థలం లేదని చెప్పే ప్రభుత్వం ప్రభుత్వభూములను అమ్మేందుకు సిద్ధం కావడం దారుణమన్నారు.ప్రభుత్వం విడుదల చేసిన జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ విషయం పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, రాష్ట్ర సంపద అనేది అధికార పార్టీ, ప్రభుత్వానిది కాదని, ఇది ప్రజలదన్నారు.అఖిల పక్షాల నిర్ణయ అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలన్నారు.సాగునీటి విషయంలో కష్ణాజలాలను ఆంధ్రా వాళ్లు అక్రమంగా తరలిస్తున్నారని, ఇప్పటికైనా కండ్లు తెరిచిన ముఖ్యమంత్రి న్యాయపరమైన పోరాటం చేయాలని కోరారు.రాజకీయపరమైన ఒత్తిడి తీసుకొచ్చి సాగునీటి విషయంలో అఖిలపక్షంతో మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.రేషన్కార్డ్స్ విషయంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని , సామాన్య మానవులు వైద్యం చేయించుకోలేక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక డబ్బులేక చనిపోతు న్నారన్నారు.మతిచెందిన పేదలందరికీ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.కరోనా రెండో దశ నుండి మూడోదశకు వస్తున్నందున ముందుగానే వైద్య సిబ్బందిని వ్యాక్సిన్‌ను మందులు ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని మూడో దశ ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పారేపల్లి శేఖర్‌రావు, ఎంపీటీసీ సల్లబోయిన లింగయాదవ్, సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి అల్వాల శ్రీధర్, రావులసత్యం, డబ్బీకార్ వీరోజీ పాల్గొన్నారు.