Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
పట్టణాన్ని రాజకీయాలకతీతంగా అభివద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.అంకిరెడ్డి ఫౌండేషన్ సౌజన్యంతో మున్సిపల్ వైస్‌చైర్మెన్ చల్లా శ్రీలతరెడ్డి, వినరుభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాల్టీ పరిధిలోని శాంతినగర్‌లో నిరుపేద మహిళ కుటుంబానికి నిర్మించిన నూతనగహాన్ని, కమలానగర్లో నూతన ప్యూరీఫైడ్ డ్రింకింగ్ వాటర్‌ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి తాగునీరందించాలన్న ఆలోచనలో భాగంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో మిషన్‌భగీరథలో భాగంగా ఇంటింటికి తాగునీరందించే కార్యక్రమం చివరిదశకు చేరిందన్నారు.కరోనాసమయంలో కూడా అభివద్ధి విషయంలో రాజీపడకుండా రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు.మన ముఖ్యమంత్రి కేసీఆర్ నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఇప్పటికే ఆటోనగర్‌లోని ఇండిస్టీయల్ పార్కు త్వరలో రానుందన్నారు.అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీలత విజయభాస్కర్‌రెడ్డి సౌజన్యంతో కొనసాగించడం అభినందనీయమన్నారు. రాజకీయాలకతీతంగా మున్సిపల్అభివద్ధికి తోడ్పడాలని లేకుంటే అభివద్ధి నిరోధకులుగా చరిత్రలో మిగులుతారన్నారు.అనంతరం రామాపురంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కోదాటి సోములు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్‌్ చందమళ్ళ జయబాబు, జెడ్పీటీసీ రాపోలునర్సయ్య, హుజూర్నగర్ మార్కెట్ చైర్మెన్ కడియం వెంకట్‌రెడ్డి, నేరేడుచర్ల మార్కెట్చైర్మెన్ ఇంజమూరి యశోధ రాములు, వైస్‌ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకుంట్లసోమిరెడ్డి, గ్రంథాలయ చైర్మెన్ గుర్రం మార్కండేయ,టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అరిబండి సురేష్‌బాబు,వల్లంశెట్ల రమేశ్‌బాబు, నాగండ్ల శ్రీధర్‌బాబు, కొనతం సత్య నారాయణరెడ్డి, చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మెన్ అనంత్ శ్రీనివాస్‌గౌడ్,ఎంపీటీసీ మండల రాజేష్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పోకబత్తిని రాజేష్, బుడిగె చంద్రయ్యగౌడ్, రాజేష్, నరేష్ పాల్గొన్నారు.