Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తుర్కపల్లి
జూన్ 22వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో పర్యటించనుండగా ఆదివారం హరితహారం సీఎంఓఏస్డీ ప్రియాంక వర్గీస్ ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లనుప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సభాస్థలి, భోజనశాల ఏర్పాట్లను పరిశీలించిన పనులు భారీ ఎత్తున జరుగుతున్నట్టు తెలిపారు. గ్రామ సభను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ సభకు వచ్చే గ్రామస్తులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఇతర గ్రామస్తులు రావద్దని అధికారులను ఆదేశించారు. గ్రామ సభలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికబద్ధంగా సంపూర్ణ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని కోరారు. సభ ఏర్పాట్లను టీఎస్ ఈఈసీ చైర్మెన్ బాలమల్లు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ కష్ణారెడ్డి, డీపీఓ సాయి బాబు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్, జెడ్పీ వైస్ చైర్మెన్ బిక్కు నాయక్, ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్, సర్పంచ్ పోగుల అంజనేయులు, ఆర్డీవోలు భూపాల్ రెడ్డి, సూరజ్ కుమార్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి సురేందర్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి.కష్ణ, ఎంపీటీసీ పలుకుల నవీన్ కుమార్, అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.