Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సై సహా ఇద్దరు కానిస్టేబుళ్లు డీసీపీ ఆఫీసుకు అటాచ్
- విచారణ ఆఫీసర్ గా మల్కాజ్ గిరి ఏసీపీ
నవతెలంగాణ-అడ్డగూడూరు/మోత్కూర్
యాదాద్రి జిల్లా అడ్డగూడూర్ పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉన్న మహిళ మతి చెందిన కేసులో ఎస్ఐ వి.మహేశ్వర్ సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. అడ్డగూడూరు మండలంల గోవిందాపురం గ్రామానికి చెందిన పాస్టర్ బాలశౌరి ఇంట్లో దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న వంట మనిషి మరియమ్మ మతి చెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ మహేశ్ సహా కానిస్టేబుళ్లు ఆమెను లాఠీలతో కొట్టడం వల్లనే చనిపోయిం దంటూ ఆరోపణలు వచ్చాయి. మతదేహానికి రాత్రికి రాత్రే పోస్ట్ మార్టం జరిపించాలని ప్రయత్నాలు చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆ రాత్రి మతిరాలి కుటుంబీకులు, భువనగిరిలోని కాంగ్రెస్ లీడర్లు అడ్డుకోవడంతో పోస్ట్ మార్టం చేయలేదు. ఈ కేసు విషయంలో అందరినీ తప్పుదారి పట్టించేందుకు కూడా పోలీసుల నుంచి ప్రయత్నాలు జరిగాయని ఇందులో భాగంగా కొందరితో ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగానే మరియమ్మ మతి చెందారని కాంగ్రెస్ ఎస్సీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ నాగరిగారి ప్రీతం పోలీసు ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మల్కాజ్ గిరి ఏసీపీ శ్యాంప్రసాద్ ను విచారణ ఆఫీసర్ గా నియమించారు. ఇంటర్నల్ గా విచారణ చేసిన పోలీస్ ఆఫీసర్లు.. ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చి ఎస్సై వి. మహేశ్వర్ పై శాఖాపరమైన చర్యల్లో భాగంగా యాదాద్రి భువనగిరి డీసీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు. ఆయనతో పాటు కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను కూడా అటాచ్ చేసినట్టు తెలుస్తోంది. మరో నలుగురు కానిస్టేబుళ్ల పాత్రపై కూడా విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.