Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిపో మేనేజర్ కపాకర్ రెడ్డి
నవతెలంగాణ- నార్కట్పల్లి
ఆర్టీసీ బస్సులు వెళ్లే ప్రతి గ్రామానికీ కార్గో పార్సెల్ సేవలు అందుతాయని డిపో మేనేజర్ కపాకర్ రెడ్డి పేర్కొన్నారు. కార్గో పార్సెల్ సర్వీస్ ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం స్థానిక డిపో మేనేజర్ కార్యాలయంలో కేక్ కట్ చేసి వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్గో సర్వీస్ సేవలందిస్తున్న సిబ్బందిని ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితమన్నారు. కార్గో పార్సెల్ సర్వీస్ సురక్షితంగా ,వేగంగా వినియోగదారులకు అందిస్తున్నారని వివరించారు. ప్రజలు ఆర్టీసీ కార్గో సర్వీస్ వినియోగించుకొని సమయాన్ని ఆదా చేసుకోవాలని కోరారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువగా ఆదరణ పొందిన సంస్థ ఆర్టీసీ కార్గో పార్సెల్ సర్వీస్ అన్నారు .పట్టణాల్లో డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉందన్నారు. కార్గో సేవలు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నార్కట్ పల్లి బస్ డిపోపరిధిలో 8796 హ్యాపీ పార్సిల్ ద్వారా సర్వీస్ బస్సుల ద్వారా చేరదీసి ఏడు లక్షల 66 వేల 968 రూపాయలు ఆదాయం సమకూరిందని తెలిపారు. సన్మానం పొందిన వారిలో కే.సత్యనారాయణ, కాసని పాపయ్య, శంకర్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సంధ్య రాణి, ట్రాఫిక్ సూపర్వైజర్ బిక్షమయ్య డిపో క్లారక్ మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.