Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీలకతీతంగా పల్లెల అభివద్ధి
- ఎంపీడీఓల గూగుల్ మీట్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ - నార్కట్పల్లి/నకిరేకల్
గ్రామాల్లో పారిశుధ్యం లోపం లేకుండా చూడాలని పార్టీలకతీతంగా అభివద్ధి జరగాలి అలసత్వం వహిస్తే సహించేది లేదని నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీఓలతో ఆయన గూగుల్ మీట్ ద్వారా పల్లె ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ పారిశుధ్య లోపం లేకుండా ఉండేలా ప్రతి గ్రామ కార్యదర్శి చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రతి వారం గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకోని సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. విధుల్లో అలసత్వం వహించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వివరాలు ఖరారయ్యాయని వచ్చే నెలలో నియోజకవర్గానికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రతి గ్రామంలో పారిశుధ్య లోపం లేకుండా చూడాలన్నారు. పెండింగ్లో ఉన్న వైకుంఠదామలు, పల్లె ప్రకతి వనాలు, డంపింగ్ యార్డులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు సాంబశివరావు, లాజర్ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.