Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించే గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రకటన చేసి రైతులకు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు కోరారు. ఆదివారం పట్టణకేంద్రంలో టీఎన్జీవో భవనం ఆవరణలో జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో, రాష్ట్రం ఏర్పాడ్డాక ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలలో గత 35 సంవత్సరాల కాలం నుండి ఆలేరు నియోజకవర్గ ప్రజలు రైతులు ఎదురుచూస్తున్న గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణం చేస్తానని వాగ్దానం చేశాడని తెలిపారు. గంధమల్ల ప్రాజెక్టును అతి తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చని ఇంజినీర్లు సైతం తేటతెల్లం చేశారన్నారు. ఈ నెల 21 వ తేదీన అన్ని మండలాల్లోనూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ ,మండల పట్టణ కార్యదర్శులు చవుడబోయిన కనకయ్య, గొట్టి పాములా శ్రీనివాస్,సీనియర్ నాయకులు పేరేపు రాములు, చవుడబోయినా పరశురాములు, పేరపు ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.