Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్
నవతెలంగాణ- నల్లగొండ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అర్హత పరీక్ష లేకుండానే త్వరలో డిగ్రీ అడ్మిషన్ పక్రియ ప్రారంభిస్తున్నట్టు యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ తెలిపారు. ఆదివారం నల్గొండ రీజినల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దూర విద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించేందుకు దేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అవకాశం కల్పించింది అని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఎంతోమంది వివిధ కారణాల చేత చదువును కొనసాగించలేని వారు, మధ్యలో మానేసిన వారు, చదువు మీద ఆసక్తి గలవారికి ఉన్నత విద్యను అభ్యసించి వివిధ రంగాలలో స్థిరపడ్డారని తెలిపారు. యూజీసీ న్యూ ఢిల్లీ డిగ్రీ విద్యనభ్యసించే విద్యార్థులకు అర్హత పరీక్ష రద్దు చేసినట్టు తెలిపారు. డిగ్రీలో ప్రవేశం పొందేందుకు ,ఇంటర్ ,ఓపెన్ ఇంటర్ ,ఐటిఐ రండు సంవత్సరాలు, పాలిటెక్నిక్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు నేరుగా ప్రవేశం పొందవచ్చని తెలియజేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 10 అధ్యయన కేంద్రాలలో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు పొందుతున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం ఆదేశాలు మేరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలో నల్గొండ రీజినల్ అధ్యయన కేంద్రాన్ని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీతారామారావు సందర్శించనున్నట్టు తెలిపారు.