Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) 5వరోజు అన్నదాన కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్
వేణుగోపాల్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యాలను కాపాడుకొని కరోనానుంచి బయటపడదామని డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి అన్నారు.నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆదివారం 5 వ రోజు ఉచిత అన్నదాన కార్యక్రమం పంపిణీలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని అయినప్పటికీ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రభుత్వం అందించే వైద్యాన్ని పొందాలని అన్నారు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు.కరోనా మూడవ వేవ్ అంటూ భయబ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కష్టకాలంలో సీపీఐ(ఎం) ఐసోలేషన్ కేంద్రం నడుపుతూనే ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, పట్టణ కార్యదర్శి ఎండి.సలీమ్, జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య నాయకులు భూతం అరుణకుమారి, పోలే సత్యనారాయణ, రేణుక, ఝాన్సీ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.