Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న డ్యాన్సర్లను గుర్తించి సంధ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేయడం అభినందనీయమని డ్యాన్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బండారు వీరునాయుడు అన్నారు.ఆదివారం జిల్ల్లాకేంద్రం లోని బాలకేంద్రం ఆవరణలో సూర్యాపేట డ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో డ్యాన్సర్లకు బియ్యం పంపిణీ చేసి మాట్లాడారు.సుమారు 100 మంది డ్యాన్సర్ల కుటుంబాలకు 25 కిలోల బియ్యం పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.బియ్యం పంపిణీ కార్యక్ర మానికి సహకరించిన సంధ్య హెల్పింగ్ హ్యాండ్స్ వారికి, యూఎస్ఏకు చెందిన ప్రదీప్ మాచర్ల, గోరంట్ల బాలకష్ణ, రాజిరెడ్డి,వెంకట్,ప్రశాంత్ బుస్స, అనిల్ బత్తుల,సాయిచరణ్లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్ర మంలో అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు పిడమర్తి మధు, డ్యాన్స్ మా స్టర్లు మ్యాడి, రవి, నివేదిత, డ్యాన్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.