Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
మండలపరిధిలోని ఎర్రపహాడ్ గ్రామంలో ఆదివారం యువజన కాంగ్రెస్ నాయకుడు పసుల అశోక్‌యాదవ్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జన్మదినవేడుకలను పురస్కరిం చుకుని పారిశుధ్యకార్మికులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర వస్తువులు, నిరుపేదలకు కూరగాయల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు లింగాల రామచంద్రయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జలగం యోగానంద, యువజన నాయకులు అనంతుల వెంకటేష్‌గౌడ్, చిర్ర మహేష్, శిరంశెట్టిఅభిలాష్, దేవరకొండ మహేష్, మద్దెల మధు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌టౌన్ :పట్టణంలో టీపీసీసీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇందిరాభవన్‌లో కేక్ కట్ చేశారు.100 మంది పేద ఆటోకార్మికులకు బియ్యం,కిరాణా సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే యూజర్స్ కమిటీ మెంబర్ నాగన్నగౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్రకార్యదర్శి ఈడుపుగంటి సుబ్బారావు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ అజీజ్‌పాషా, కాంగ్రెస్ ఐటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివరామ్యాదవ్, పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ కష్టాల శ్రవణ్‌కుమార్. కౌన్సిలర్లు తేజావత్రాజా, వెలిదండ సరితవీరారెడ్డి, కారింగుల విజయ వెంకటేశ్వర్లు, నాయకులు బాచిమంచి గిరిబాబు, జుట్టుకొండ సత్యనారాయణ, వల్లపుదాసు కష్ణ, దొంతగాని జగన్, బెల్లంకొండగురవయ్య, ఇంటి అచ్చమ్మ, మేళ్లచెరువు ముక్కంటి, శివపార్వతి, జింజిరాలసైదులు, అజ్జు, రవీందర్, రాము పాల్గొన్నారు.
మిర్యాలగూడ :టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిల జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని కొత్తగూడెం గ్రామంలోని మహర్షి దయానంద సేవాశ్రమం, ఫెయిత్ బంజారా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు నూకల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులందర్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణను సాధించిన ఘనత జానా, ఉత్తమ్లేదనన్నారు. తెలంగాణ ఉద్యమ రోజుల్లో తెలంగాణ కోసం పోరాటం చేయాలని జానా ఇంటి వద్ద కేసీఆర్ చెప్పిన మాటలన్నీ మర్చిపోయి ఇప్పుడు పూర్తిగా వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రభుత్వం లీనమైపోయిందన్నారు. జానా అధిష్టానాన్ని ఒప్పించకుంటే తెలంగాణ వచ్చేది కాదని, ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, కౌన్సిలర్స్ దేశిడి శేఖర్‌రెడ్డి, గంధం రామకష్ణ, క్రికెటర్ జానీ, ఎంపీటీసీ ఇజ్రాయిల్, సర్పంచ్ అంజయ్య, సారెడ్డి శంకర్‌రెడ్డి, గాజుల శ్రీనివాస్, పవన్‌కల్యాణ్, బంటు నగేష్, పద్మ, నారాయణమ్మ, రాము పాల్గొన్నారు.
పెద్దవూర: మండలకేంద్రంలో మాజీ హోంమంత్రి కుందూరు జానారెడ్డి,టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.పెద్దవూర మెయిన్‌సెంటర్‌లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.వృద్ధులకు, వికలాంగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌని రాజారమేశ్‌యాదవ్, నాయకులు పగడాల నాగరాజు, చల్లా హనుమంతరెడ్డి, సంతోష్ పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ : పట్టణంలోని పైలాన్‌కాలనీలో జానారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహి ంచారు.యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనరెడ్డి కేక్‌కట్ చేసి స్వీట్లు పంచారు.పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు నేనావత్ ప్రవళిక కిషన్ నాయక్, జిల్లా ప్రెసిడెంట్ రాజారమేశ్, నియోజకవర్గ అధ్యక్షులు పగడాల నాగరాజు, ఉపాధ్యక్షులు మేరావత్ మునినాయక్,జిల్లా ఉపా ధ్యక్షులు శ్రీధర్ నాయక్,కసిరెడ్డి నరేష్, జగదీష్‌రెడ్డి, టంగుటూరి సురేష్, సతీష్, దేవరకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లింగం గౌడ్,చిత్రంరమేశ్, సంతోష్,సైదులు, శివ, రత్నం, శ్రీకాంత్ పాల్గొన్నారు.