Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలుగా ఉన్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలని 104 ఉద్యోగ సంఘాల జిల్లా కార్యదర్శి కొండల్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపు మేరకు ఏరియాస్పత్రి ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఆరోగ్య శాఖ సిబ్బందిని గుర్తించి, గతంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ రమణమ్మ , సూపర్వైజర్ వాణి, అరుంధతి, ఏఎన్ఎంలు ఎస్ కేతమ్మ, కవిత, గౌసియా, శ్యామల, గీత, పుష్ప, మంజుల, ఆదిలక్ష్మి, రజిత, అశ్విని, ఆర్ బి ఎస్ కె సిబ్బంది లలిత, అన్నపూర్ణ, ఆరోగ్యమిత్ర జాల సత్యనారాయణ, పాల్గొన్నారు.