Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయప్రదినిధి
వికలాంగులకు, వృద్ధులకు వారి నివాస స్థలంలోనే వ్యాక్సినేషన్ వేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వర చారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రకాశ్, వనం ఉపేందర్ మాట్లాడుతూ వికలాంగులకు, వృద్ధులకు వారి నివాస స్థలంలోనే వ్యాక్సిన్ వేయాలని గత నెల 21న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 2021 జనవరి 16 నుండి దశాబ్దంగా వ్యాక్సినేషన్ పక్రియ ప్రారంభమైనప్పటికీ వికలాంగులు వినియోగించుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వికలాంగుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి తక్షణమే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కీసర వెంకట రెడ్డి, పాక వెంకటేశం జిల్లా కోశాధికారి బోల్లేపల్లి స్వామి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ కొత్త లలిత కో కన్వీనర్ పద్మ జిల్లా నాయకులు రేణుక పార్వతమ్మ ,పద్మ శంకర్ కొండల్ వెంకటేశం అంజన్ శ్రీ ,తదితరులు పాల్గొన్నారు.