Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మోటకొండూర్
మండల కేంద్రానికి చెందిన చెరువును పూర్తిస్థాయిలో నింపేందుకు ముందస్తుగా కట్టు కాలువ మరమత్తు పనులకు సోమవారం ప్రారంభించినట్టు ఉపసర్పంచ్ రేగు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కురిసిన అకాల వర్షాలకు కట్టు కాలువ తెగిపోవడంతో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావును కలిసి నిధులు మంజూరు చేయాలని కోరినట్టు తెలిపారు. మంత్రి వెంటనే కట్టు కాలువ పనులకు ఇరిగేషన్ శాఖ తరుపున నిధులను మంజూరు చేయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డీఈ సునిల్ కుమార్, మాజీ సర్పంచ్ బుగ్గ శ్రీశైలం, మాజీ నీటి సంఘం చేర్మైన్ కొల్లూరి యాదగిరి,మాజీ వైస్ ఎంపీపీ బల్డా లింగం ,కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వంగపల్లి మహేందర్, ఎగ్గిడి వెంకటేష్ వార్డు సభ్యులు బీరకాయల మల్లేష్ ,భాస్కర్ , నాగచందర్, గౌతమ్, కొరటికంటి విజరు చందర్ తదితరులు పాల్గొన్నారు.